భారతదేశం, అక్టోబర్ 1 -- Sundeep Kishan: తెలుగు హీరో సందీప్ కిషన్ తమిళంలో చేసిన మూవీ 'సిగ్మా'. ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ కానుంది. రేపు (అక్టోబర్ 2)న ప్రపంచవ్యాప్తంగా సిగ్మా మూవీ గ్రాండ్ గా విడుదవ అవుతుంది. ఈ నేపథ్యంలో మూవీని టార్గెట్ చేస్తూ యాంటీ ట్వీట్లు చేస్తున్న వాళ్లకు సందీప్ కిషన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఎక్స్ లో పెట్టిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది. ''గత కొన్ని రోజులుగా నన్ను, నా సినిమా (సిగ్మా)ను టార్గెట్ చేస్తూ చాలా యాంటీ ట్వీట్లు రావడం చూస్తున్నా. దీని వెనుక ఎవరున్నారో నాకు తెలుసు. దీనికి ఎవరు అమౌంట్ చెల్లిస్తున్నారో కూడా తెలుసు'' అని సందీప్ కిషన్ తన పోస్టులో రాసుకొచ్చారు.

''నా కంటే ఎక్కువగా మీరే నష్టపోతారని గుర్తు పెట్టుకోండి. డైరెక్ట్ అయిపోతే అందరూ దొరికిపోతారు మరి చూసుకోండి'' అని సందీప్ కిషన్...