భారతదేశం, నవంబర్ 15 -- Sunday OTT Movies: ఓటీటీలో కొత్త సినిమాలకు కొదవే లేదు. రోజుల తరబడి చూసినా తరగని చిత్రాలున్నాయి. అయితే ఈ మూవీస్ లో బెస్ట్ ఏవీ? టాప్ ఏవీ? ఏ సినిమాలు చూడాలి? అనేది తేల్చుకోవడమే కష్టం. అందుకే ఈ వారం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి, టాప్ వ్యూస్ తో దూసుకుపోతున్న 5 సినిమాల లిస్ట్ మీ కోసమే ఇక్కడుంది.

ముందుగా తమిళంలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'జైలర్ 2' గురించి మాట్లాడుకుందాం. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సూపర్ హిట్ సీక్వెల్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి మరోసారి తలైవా రజినీకాంత్ స్టార్ పవర్ ను చాటింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో స్ట్రీమ్ అవుతోంది.

స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెలుగులో వచ...