భారతదేశం, మే 5 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. సూర్యుడు ప్రతినెల తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. సూర్య సంచారంలో మార్పు వస్తే అది 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. మే 15న సూర్యుడు వృషభ రాశిలోకి అడుగు పెడతాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

జ్యోతిష లెక్కల ప్రకారం చూసినట్లయితే, మే 15న తన శత్రు రాశి అయిన వృషభ రాశిలోకి సూర్యుడు అడుగుపెడతాడు. దీంతో కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కెరీర్, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. మరి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఎవరికీ ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశి వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు పనిలో అడ్డంకులను ఎదుర్కొంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. కోపం పెరుగుతుంది, ఇరి...