భారతదేశం, జూన్ 21 -- సౌర కుటుంబానికి అధిపతి సూర్యుడు. మానవ జీవితంలో ఆత్మవిశ్వాసం, కీర్తి, అధికారం, ఉన్నత స్థానాలకు సూర్యుడే కారకుడు. జాతక చక్రంలో సూర్యుడు బలంగా ఉంటే, ఆ వ్యక్తి ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది. వారి మాటలకు సమాజంలో ఎంతో విలువ ఉంటుంది. అదే సూర్యుడు నీచ స్థితిలో లేదా బలహీనంగా ఉంటే, ఎంత కష్టపడినా గుర్తింపు దక్కదు, పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది క్లిష్టమైన పూజలు, వ్రతాలు చేస్తుంటారు. కానీ, మన అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే సూర్యుడి ఆశీస్సులు సులభంగా పొందవచ్చు.

సూర్యుడు క్రమశిక్షణకు మారుపేరు. ఆయన ప్రతిరోజూ ఖచ్చితమైన సమయానికి ఉదయించి, ప్రపంచానికి వెలుగునిస్తాడు. ఆ లక్షణమే మనలో ఉంటే సూర్యుడు బలపడతాడు.

వేకువజామునే నిద్రలేవడం: ఆలస్యంగా నిద్రలేవడం సూర్యుడి శక్తిని హరిస్తుంది. సూర్యోదయాన...