భారతదేశం, మార్చి 22 -- ఆమె ఓ మాటల ప్రవాహం. మైక్ అందుకుందంటే ఇక నాన్ స్టాప్ ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్లాల్సిందే. టీవీ షోలు అయినా, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయినా ఆమె ఉంటే సక్సెస్ కావాల్సిందే. ఆమెనే.. బుల్లితెర మహారాణిగా పేరు తెచ్చుకున్న సుమ కనకాల. ఈ టాప్ యాంకర్ బర్త్ డే ఈ రోజు. తన భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాజీవ్ కనకాల పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

తెలుగులో టాప్ యాంకర్ ఎవరు? అంటే ఠక్కున వినిపించే సమాధానం సుమ కనకాల. అసలు ఆమెకే పోటీనే లేదని చెప్పొచ్చు. ఈ రోజు (మార్చి 22) సుమ బర్త్ డే. ఈ సందర్భంగా తన భార్యకు బర్త్ డే విషెస్ చెప్తూ రాజీవ్ కనకాల ఎక్స్ లో కొన్ని ఫొటోలు పంచుకున్నాడు.

''శుభజన్మదినం తుభ్యం

శుభజన్మదినం తుభ్యం

శుభజన్మదినే తవ హే

సకలం సఫలం భూయాత్

సకలం చ శుభం భూయాత్

నిండూ నూరేళ్లు. కాదు కాదు, ఒక 120-130 ఏళ్లు మీ...