భారతదేశం, జూన్ 5 -- Sukumar Students: దర్శకుడు సుకుమార్ గ్యారేజ్ నుంచి వచ్చిన ప్రతిభావంతులైన శిష్యులు ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమను శాసిస్తున్నారు. 2026 సంవత్సరం పూర్తిగా ఈ 'సుకుమార్ స్కూల్' దర్శకుల దండయాత్రకు వేదికగా మారిందనే టాక్ వినిపిస్తోంది. 'పెద్ది'తో ఇప్పటికే బుచ్చిబాబు అదరగొడుతున్నాడు.

మొదటి సినిమాలతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు సుకుమార్ శిష్యులు. ఈ యువ దర్శకులు, ఇప్పుడు తమ రెండో సినిమాలతోనే ఏకంగా వందల కోట్ల బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కిస్తూ బాక్సాఫీస్ వద్ద నయా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. వాళ్లే బుచ్చిబాబు సాన, కార్తీక్ దండు, శ్రీకాంత్ ఓదెల.

అయితే, కేవలం భారీ బడ్జెట్లే కాదు.. ఈ ముగ్గురు దర్శకుల వెనుక ఉన్న కంటెంట్ మేకింగ్ స్ట్రాటజీ, సుకుమార్ స్క్రీన్‌ప్లే మ్యాజిక్ టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయ...