భారతదేశం, అక్టోబర్ 29 -- Sudha: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి 'గ్యాంగ్ లీడర్' లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో వదిన, అక్క, తల్లి పాత్రల్లో నటించి ఆమె మెప్పించారు. దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించిన సుధ.. తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. వెండితెరపై ఎంతో ఆనందంగా, హుందాగా కనిపించే ఆమె నిజ జీవితంలో మాత్రం ఎన్నో కన్నీటి గాథలు దాగి ఉన్నాయి.

సుధ అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. నలుగురు అన్నయ్యల మధ్య ఏకైక ఆడపిల్ల కావడంతో ఎంతో గారాబంగా పెరిగారు. ఇంట్లో మూడు కార్లు, ఎంతో మంది పనివాళ్లతో ఆమె బాల్యం రాజభోగాల మధ్య సాగింది. కానీ ఆమె తండ్రి క్యాన్సర్ బారిన పడటంతో పరిస్థితి పూర్తిగా తారుమారైంది.

నాన్న వైద్యం కోసం ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి. అప్పటికి సుధ వయసు కేవలం 8 ఏళ్లు మాత్రమ...