భారతదేశం, ఏప్రిల్ 28 -- Indian students abroad : ప్రతిభ ఉన్న భారతీయుడు ప్రపంచ వేదికపై తన సత్తా చాటాలని కోరుకోవడం సహజం. అయితే, ఒకప్పుడు కేవలం డిగ్రీ కోసమే విదేశాలకు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది! నీతి ఆయోగ్ విడుదల చేసిన 'ఇంటర్నేషనల్ స్టూడెంట్ మొబిలిటీ: ఏ గ్లోబల్ అండ్ ఇండియన్ టెంపోరల్ ఓవర్‌వ్యూ' అనే పరిశోధనా పత్రం ప్రకారం.. భారతీయ విద్యార్థులు ఇప్పుడు కెరీర్ గ్యారెంటీ ఇచ్చే కోర్సులనే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, డేటా సైన్స్, మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో భారీగా ఎన్‌రోల్‌మెంట్లు జరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉన్న డిమాండ్ దృష్ట్యా, భారతీయ విద్యార్థులు ఎక్కువగా స్టెమ్ (Science, Technology, Engineering, Mathematics) కోర్సుల వైపు పరుగెత్తుతున్నారు. 2020-21 గణాంకాల ప్రకారం, విదేశాలకు వెళ్లే విద్యార్థులలో...