భారతదేశం, మార్చి 23 -- గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు! ఇరాన్-అమెరికా మధ్య మాటల యుద్ధం ఇప్పటికే అంతర్జాతీయ ఇంధన భద్రతను వణికించే స్థాయికి చేరుకుంది. ఈ తరుణంలో.. ప్రపంచ ఇంధన సరఫరాకు జీవనాధారంగా చూసే స్ట్రెయిట్​ ఆఫ్​ హర్ముజ్​ (హర్ముజ్​ జలసంధి)పై ఇరాన్​ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ విద్యుత్​ ప్లాంట్లపై అమెరికా దాడి చేస్తే, హర్ముజ్​ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

ఇరాన్‌కు చెందిన ఖాదం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాగారి ఈ హెచ్చరికలు జారీ చేశారు. "ఒకవేళ అమెరికా గనుక మా విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తే, హర్ముజ్ జలసంధిని మేం పూర్తిగా మూసివేస్తాం. కూలిపోయిన మా ప్లాంట్లను తిరిగి నిర్మించే వరకు ఆ మార్గాన్ని మళ్లీ తెరిచే ప్రసక్తే లేదు," అని ఆయన స్పష్టం చ...