భారతదేశం, ఫిబ్రవరి 13 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 559 పాయింట్లు పడి 83,675 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 147పాయింట్లు కోల్పోయి 25,807 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ కేవలం 6 పాయింట్లు పడి 60,740 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 108.42 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 276.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ఫిబ్రవరి నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 6,021.85 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,221.99 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 140 పాయిం...