భారతదేశం, నవంబర్ 23 -- వరుసగా నాలుగు వారాల పాటు లాభాల జోరు కొనసాగించిన భారత స్టాక్ మార్కెట్లకు సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉదయం లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురై కుప్పకూలాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి బీఎస్ఈ సెన్సెక్స్ ఒకానొక సమయంలో ఏకంగా 1,600 పాయింట్లకు పైగా పతనం కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కీలకమైన 25,600 మార్కు దిగువకు జారుకుంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్ 1,091 పాయింట్ల నష్టంతో 82,829 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 335 పాయింట్లు కోల్పోయి 25,465 వద్ద నిలిచింది.

ఈ ఆకస్మిక పతనంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది! శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 5,14,18,275 కోట్లుగా ఉండగా, సోమవా...