భారతదేశం, ఏప్రిల్ 13 -- Stock Market Latest news : ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాలు- భారీ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 919 పాయింట్లు పెరిగి 77,550 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 275 పాయింట్లు వృద్ధిచెంది 24,051 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1091 పాయింట్లు పెరిగి 55,913 వద్దకు చేరింది.

కాగా అమెరికా- ఇరాన్​ మధ్య శాంతి చర్చలు విఫలం అవ్వడం, ప్రపంచ చమురు సరఫరాకు జీవనాధారంగా భావించే హర్ముజ్​ జలసంధిని పూర్తిగా బ్లాక్​ చేస్తున్నట్టు (ఒక్క ఓడ కూడా బయటకు వెళ్లకుండా) అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించడంతో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లలో రక్తపాతం కనిపిస్తోంది.

శుక్రవారం ట్రేడింగ్​ స...