భారతదేశం, మార్చి 30 -- ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా యుద్ధం నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1690 పాయింట్లు పడి 73,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 487 పాయింట్లు కోల్పోయి 22,820 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1433 పాయింట్లు పడి 52,275 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ.4,367.30 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,566.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ నెలలో ఎఫ్​ఐఐల విక్రయాలు రూ. 1లక్ష కోట్లు దాటేశాయి. భారత స్టాక్​ మార్కెట్​ చరిత్రలో ఎఫ్​ఐఐలు ఈ స్థాయిలో అమ్మకాలు చేయడం ఇదే మొదటిసారి!

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్ట...