భారతదేశం, అక్టోబర్ 8 -- ఇండియాలోకి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే స్టార్​లింక్ ఎంట్రీకి సంబంధించి 'స్పేస్‌ఎక్స్', ఎక్స్, టెస్లా అధినేత, ట్రిలియనీర్ ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోకి శాటిలైట్ ఇంటర్నెట్ రాకుండా కొందరు వ్యాపార దిగ్గజాలు తమ ఏకఛత్రాధిపత్యాన్ని కాపాడుకునేందుకు కుట్ర పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో భారత్‌లోని మారుమూల, డిజిటల్ కనెక్టివిటీ లేని ప్రాంతాలకు స్టార్‌లింక్ సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

"భారత ప్రజలపై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి కొందరు వ్యాపార దిగ్గజాలు మమ్మల్ని అడ్డుకోవడం అత్యంత విచారకరం. ఆ వ్యాపారవేత్తలు ఎవరో మీరు సులభంగా ఊహించవచ్చు. ఇది భారత ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరం," అని మస్క్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించేందుకు తుది అనుమతుల కో...