భారతదేశం, ఏప్రిల్ 14 -- Star Maa: మలయాళం నుంచి ఈ ఏడాది వచ్చిన అద్భుతమైన హారర్ కామెడీ మూవీ సర్వం మాయ. క్యూట్ దెయ్యంతో ఓ వ్యక్తి ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సాగే స్టోరీతో వచ్చిన ఈ సినిమా తెలుగు వాళ్లను కూడా బాగా ఆకట్టుకుంది. ఈ మూవీకి సంబంధించి ప్రముఖ తెలుగు ఎంటర్టైన్‌మెంట్ ఛానల్ 'స్టార్ మా' (Star Maa) మరో క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను అనౌన్స్ చేసింది.

"కొన్ని కథలు ముగిసినా.. మనతోనే ఉండిపోతాయి" అంటూ స్టార్ మా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సర్వం మాయ మూవీ కేవలం కల్పిత కథగా కాకుండా, మనిషి జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను, బంధాలను ప్రతిబింబించేలా సాగుతుంది.

సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. దీంతో ఈ ఆదివారం (...