భారతదేశం, జూలై 2 -- SS Rajamouli: గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత్ గర్వపడేలా చేశారు. ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ఉన్న ప్రసిద్ధ లూమియర్ మ్యూజియం (Lumiere Museum) సందర్శించిన ఆయనకు అక్కడ అత్యంత అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ల పక్కన రాజమౌళి పేరును శాశ్వతంగా చేర్చడంతో ఆ మెగా ఈవెంట్ లో ఎమోషనల్ సీన్స్ కనిపించాయి.

ఈ ప్రత్యేక పర్యటనలో భాగంగా లూమియర్ మ్యూజియంలో రాజమౌళి విజువల్ వండర్స్ 'ఈగ' (Eega), 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాలను స్పెషల్ గా స్క్రీనింగ్ చేశారు. హాల్ మొత్తం ప్రేక్షకులతో నిండిపోగా, విదేశీ ఆడియన్స్ మన జక్కన్న మేకింగ్‌కు పూర్తిగా ఫిదా అయిపోయారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రేమాక్స్ (Thierry Fremaux) స్వయంగా రాజమౌళిని అక్కడి ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేయడం విశేషం....