భారతదేశం, అక్టోబర్ 23 -- SS Rajamouli: తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాతో ఆస్కార్ వేదికపై భారతీయ జెండాను ఎగురవేసిన తర్వాత.. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? హాలీవుడ్‌లో సినిమా చేస్తారా? లేదా? అనే అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది.

తాజాగా బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన రాజమౌళి.. స్థానిక బ్రెజిలియన్ మీడియా ('ఒమెలెట్') కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో వస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi) షూటింగ్ కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉందని క్లారిటీ ఇచ్చారు.

హాలీవుడ్ వర్కింగ్ కల్చర్, అక్కడ ఉండే నెట్‌వర్కింగ్, ప్రొడక్...