భారతదేశం, ఆగస్టు 30 -- శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తుల కోసం ఒక విశేష అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. గుజరాత్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్‌లో జరగనున్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ - 1,000 ఇయర్స్ ఆఫ్ అన్‌బ్రోకెన్ ఫెయిత్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రత్యేక తీర్థయాత్రను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శ్రీశైల దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది.

సోమనాథ్ ఆలయంపై చారిత్రక దాడి జరిగి 1,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని, అలాగే భారత స్వాతంత్య్రానంతరం ఈ మహా క్షేత్రాన్ని పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తయిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, ధర్మం, విశ్వాసాల పునరుజ్జీవనానికి సంకేతంగా నిలిచే ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యమయ్యేందుకు శ్రీశైల క్షేత్రం నుండి సుమారు 50 మ...