భారతదేశం, జూలై 29 -- Srinivasa Mangapuram: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ లవ్ యాక్షన్ డ్రామా 'శ్రీనివాస మంగాపురం' రేపే అంటే జులై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో పాన్-ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నుంచి ఊహించని సర్‌ప్రైజ్ వచ్చింది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరోగా పరిచయమవుతున్న జయకృష్ణకి, రషా తడానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ స్పెషల్ బ్లెస్సింగ్స్ అందించారు. పెద్ద సినిమా రిలీజ్ ముందు ప్రభాస్ నుంచి ఇలాంటి బూస్ట్ రావడంతో ఘట్టమనేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో 'స్పిరిట్' (Spirit) షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో 'శ్రీనివాస మంగాపురం' పోస్టర్ షేర్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని మహేష్ బాబు అన్న కొడు...