భారతదేశం, సెప్టెంబర్ 23 -- Srikanth Odela: నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' కొన్ని గంటల్లో థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. ఈ కీలక సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమాలో నాని కనిపించే పవర్‌ఫుల్ 'జడల' లుక్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఆయన బయటపెట్టారు.

శ్రీకాంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ చాలా హార్ట్ టచింగ్ నోట్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసి నాని ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఫిదా అవుతున్నారు.

శ్రీకాంత్ ఓదెల తన పోస్ట్‌లో రాస్తూ.. "జడల్ పుట్టుక, అతను చేసే పోరాటం ఫిక్షనల్ కావచ్చు. కానీ తన జడలు, ఓవరాల్ లుక్ మాత్రం నా చిన్నతనం నుంచి ఇన్‌స్పైర్ అయి డిజై...