భారతదేశం, అక్టోబర్ 29 -- Srikanth Odela: దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన చిత్రం 'ది ప్యారడైజ్'. అయితే ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దర్శకుడు ప్రమోషన్స్ లో చెప్పిన దానికి, థియేటర్లో చూపించిన కంటెంట్ కి అసలు పొంతన లేకపోవడంతో ప్రేక్షకులు శ్రీకాంత్ ఓదెలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ముఖ్యంగా ది ప్యారడైజ్ సినిమాలో మితిమీరిన రక్తపాతం, లాజిక్ లేని యాక్షన్ సీక్వెన్సులు, సెకండాఫ్ సాగదీత ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ సైతం ఈ సినిమా ఎడిటింగ్ చెత్తగా ఉందంటూ ఏకంగా 1 స్టార్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఇక నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన తర్వాత ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. థియేటర్లో విపరీతంగా ట్రోల్స్ కు గుర...