భారతదేశం, నవంబర్ 25 -- Sridevi Mithun Love Story: భారతీయ వెండితెరపై అతిలోక సుందరిగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న దివంగత నటి శ్రీదేవి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఆసక్తికరమే. ముఖ్యంగా 1980వ దశకంలో బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తితో ఆమెకున్న సాన్నిహిత్యం, ప్రేమాయణం అప్పట్లో సినీ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.

తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ లారెన్స్ డిసౌజా (Lawrence D'Souza) సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి, మిథున్ మధ్య ఉన్న గాఢమైన ప్రేమ గురించి ఎన్నో ఆసక్తికర, సంచలన నిజాలను బయటపెట్టారు.

ఆ రోజుల్లో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ లారెన్స్ డిసౌజా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

"శ్రీదేవి సాధారణంగా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా తన పని తాను చేసుకునే రిజర్వ్‌డ...