భారతదేశం, మార్చి 22 -- ఐపీఎల్ 2026 సమరానికి తెరలేవక ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో వాతావరణం వేడెక్కింది. సీజన్ కు ముందు టీమ్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన అంతర్గత ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్, యువ లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఐపీఎల్ 2026 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ను ఇషాన్ కిషన్ నడిపించనున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా యువ బౌలర్ జీషన్ అన్సారీ వేసిన ఒకే ఓవర్‌లో ఏకంగా 20 పరుగులు పిండుకుని తన ఫామ్‌ను చాటుకున్నాడు.

జీషన్ అన్సారీ కూడా ఏమాత్రం తగ్గకుండా కిషన్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ ఏమాత...