భారతదేశం, జూన్ 13 -- Sreemukhi: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఎనర్జిటిక్ స్టైల్, భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె, ప్రస్తుతం బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకుంటున్న యాంకర్ల జాబితాలో ముందు వరుసలో ఉంది. యాంకరింగ్‌తో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నఈ రాములమ్మ, వెండితెరపై కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శ్రీముఖి రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' చిత్రంలో శ్రీముఖి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో జూన్ 19న విడుదల కాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో శ్రీముఖి పాత్ర హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. సమంతకు ఆమె తోడి కోడలుగా నటించింది.

​సమంత స్వయంగా తన సొంత బ్యా...