భారతదేశం, ఆగస్టు 15 -- Sreeleela: దక్షిణాదిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రీలీల చాలా కాలం క్రితమే కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్‌లో ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్‌ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ అసలు సెట్స్‌పైకి వెళ్తుందా లేక పక్కన పెట్టేశారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే, ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ శ్రీలీల ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అయిందని టాక్. అనురాగ్ బసు ప్లాన్ చేసిన ఈ లాంగ్ షెడ్యూల్‌లో కార్తీక్ ఆర్యన్, శ్రీలీలల మధ్య కీలకమైన రొమాంటిక్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది.

కార్తీక్, శ్రీలీల జోడీగా నటిస్తున్న ఈ సినిమాను 'ఆషికి 3' (Aashiqui 3) గా ప్రచారం చేశారు. అయితే, ఇది ఏ ఫ్...