భారతదేశం, ఏప్రిల్ 15 -- Sreeleela: టాలీవుడ్‌లో 'ఎనర్జీ బాంబ్'గా పేరు తెచ్చుకున్న శ్రీలీల.. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా తన వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడంలోనూ అంతే వేగంగా దూసుకుపోతోంది. ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసి 'డాక్టర్ శ్రీలీల'గా పట్టా అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ బబుల్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన ప్రయాణంలోని కష్టనష్టాలను పంచుకుంది. ఒకే సమయంలో కెమెరా ముందు డ్యాన్స్ చేయడం, మేకప్ తీసేసి మెడికల్ బుక్ పట్టుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యాలను బయటపెట్టింది.

సినిమాలు, చదువు.. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేశారని అడగ్గా, శ్రీలీల చాలా మెచ్యూరిటీతో సమాధానం ఇచ్చింది. "ఈ ప్రయాణానికి ముఖ్యంగా కావాల్సింది సంకల్పం, సహనం. ఒక విషయం నుంచి మరో విషయానికి మారినప్పుడు మనసును 'ఆన్ అండ్ ఆఫ్' చేయడం నేర్చుకోవాలి. కొన్ని రోజులైతే నాకు పిచ్చెక్కిపోతుందేమో...