భారతదేశం, సెప్టెంబర్ 14 -- Sree vishnu: సంక్రాంతి 2027 ఫైట్ మహా టఫ్ గా మారుతోంది. ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలు బరిలో నిలవగా.. తాజాగా శ్రీవిష్ణు ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ కూడా సై అంటోంది. 'సామజవరగమన'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు- శ్రీవిష్ణు కాంబినేషన్ లో వస్తున్న రెండో మూవీకి 'ఫ్యామిలీ ప్యాక్' అనే టైటిల్ పెట్టారు.

ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్లతో ప్రేక్షకులను నవ్వించడంలో ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరో శ్రీవిష్ణు. అతను మరోసారి దర్శకుడు రామ్ అబ్బరాజుతో జతకట్టాడు. ఈ ఇద్దరి సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మళ్లీ ఒకటైంది. 'ఫ్యామిలీ ప్యాక్' అంటూ ఫ్యామిలీ కామెడీ మూవీతో వీళ్లు థియేటర్లకు రాబోతున్నారు.

వినాయక చవితి పండగ సందర్భంగా ఫ్యామిలీ ప్యాక్ టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. అలాగే మూవీ రిలీజ్ ఎప్పుడనేది కూడా నిర్మాతలు అనౌన్స్ చేశా...