భారతదేశం, మే 1 -- ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, అనుకున్నవి జరగాలని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అవి పూర్తి కావు. అయితే అనుకున్నదే సాధించాలన్న విజయాన్ని అందుకోవాలని, ప్రయత్నంతో పాటుగా ఈ భక్తి మార్గాలని కూడా ఫాలో అవ్వండి. సనాతన ధర్మంలో ప్రతి కార్యానికి కూడా దైవస్మరణను ఆది చేయాలని ఆచార వేత్తలు చెప్పారు. గ్రహ స్థితి అనుకూలంగా లేకపోతే కూడా అనుకున్న వాటిని పూర్తి చేయలేము, విజయాలనే చేరుకోలేము.

జపాలు, ఉపవాసాలు, పారాయణ ద్వారా మనసుకు స్థిరత్వం కలుగుతుంది. కార్యానికి అనుకూలత కలుగుతుంది. విజయం వరిస్తుంది. దైవానుగ్రహంతో ఉండే పనులు కచ్చితంగా పూర్తవుతాయి. అయితే మరి ఈరోజు విజయాల కోసం భక్తి మార్గాల గురించి చూద్దాం. వీటిలో మీకు ఏం కావాలో, దానికి తగ్గ పరిహారాలు పాటిస్తే చక్కగా విజయాన్ని అందుకోవచ్చు. అనుకున్నవన్నీ పూర్తి చేయొచ్చు. ఏ ఆటంకాలు, ఇబ్బందుల...