భారతదేశం, అక్టోబర్ 3 -- Spiderman OTT: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చే ప్రతి సినిమా ఒక సెన్సేషన్ సృష్టిస్తుంది. అందులోనూ 'స్పైడర్-మ్యాన్' సినిమా అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. థియేటర్లలో సరికొత్త రికార్డులను తిరగరాసి, ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపించిన లేటెస్ట్ విజువల్ వండర్ 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది.

'నో వే హోమ్' సినిమా ముగింపులో పీటర్ పార్కర్ ఉనికిని ప్రపంచం మొత్తం మర్చిపోతుంది. ఈ 'బ్రాండ్ న్యూ డే' కథ దానికి నాలుగు సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది. తన ప్రాణ స్నేహితుడు నెడ్, ప్రేమించిన ఎంజే తనకు దూరమవడంతో పీటర్ తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తూ ఒంటరిగా జీవిస్తుంటాడు.

ఆ బాధను మర్చిపోవడానికి పూర్తి సమయం స్పైడర్-మ...