భారతదేశం, మార్చి 1 -- ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో చాలా మంది భారతీయ ప్రముఖులు దుబాయ్ లో చిక్కుకుపోయారు. ఇండియాకు ఫ్లైట్స్ లేకపోవడంతో అక్కడే ఉండిపోయారు. వీళ్లలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ఉంది. దుబాయ్ లో చిక్కుకుపోయిన తనను ఇండియాలోని ఇంటికి చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సోనాల్ కోరింది.

మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ పెరుగుతూనే ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా కలిసి మిస్సైల్స్ లో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అరబ్ దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను వివిధ దేశాలు రద్దు చేశాయి. ఇండియా కూడా మిడిల్ ఈస్ట్ కు ఫ్లైట్స్ సర్వీస్ లను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇండియన్స్ అక్కడే చిక్కుకుపోయారు.

హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా దుబాయ్ లో చిక్కుకుపోయింది. కొన్ని రోజుల ముందు ఆమె అక్కడికి వెకేషన్ కు వెళ్లింది. ఇప్పుడు యు...