భారతదేశం, అక్టోబర్ 2 -- ఆకాశంలో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డ వేళ, తీవ్రగాయాలైనా వెనకడుగు వేయకుండా సమయస్ఫూర్తితో ఘోర విపత్తును అడ్డుకున్న భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నేరుగా వీడియో కాల్ మాట్లాడారు. ఆపద సమయంలో ప్రాణాలకు తెగించి విమానాన్ని సురక్షితంగా నిలబెట్టిన ఆయన ధైర్యసాహసాలను మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆ ఘోర క్షణాల్లో తనకు ఎదురైన అనుభవాన్ని కెప్టెన్ స్మిత్ ప్రధానికి వివరించారు. "నా ప్రాణాల కోసం నేను పోరాడుతున్న క్షణాల్లో.. నేను గనుక ధైర్యం ప్రదర్శించకపోతే విమానంలో ఉన్న 170 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతారని గ్రహించాను. అందుకే ప్రాణాలకు త...