భారతదేశం, ఏప్రిల్ 24 -- మన ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్ అనేది ఒక ప్రాథమిక అవసరం. కానీ, గత కొన్ని ఏళ్లుగా వీటి రూపరేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం గాలిని ఇవ్వడానికే పరిమితమైన ఫ్యాన్లు, ఇప్పుడు రిమోట్ కంట్రోల్ ఆపరేషన్, ఇన్-బిల్ట్ ఎల్​ఈడీ లైటింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ అప్లయన్సెస్‌గా పరిణామం చెందాయి. ఇది వినడానికి చిన్న మార్పులా అనిపించినా, మన దైనందిన జీవితంలో ఇది ఎంతో సౌకర్యాన్ని తీసుకొస్తోంది.

మనం పెరిగిన వాతావరణంలో ఫ్యాన్ వేగం మార్చాలంటే గోడకున్న రెగ్యులేటర్ వద్దకు వెళ్లాల్సిందే. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ అవసరం లేకుండా పోయింది! ఆధునిక ఫ్యాన్లు రిమోట్ కంట్రోల్ సౌకర్యంతో వస్తున్నాయి. రాత్రిపూట నిద్ర మధ్యలో ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలన్నా లేదా ఆపేశాలన్నా బెడ్ పై నుంచి లేవాల్సిన అవసరం లేదు.

అంతేకాకుండా, నేటి తరం ఫ్యాన్లలో బ్రష్​లెస...