భారతదేశం, ఆగస్టు 7 -- రోజంతా కష్టపడి అలసిపోయిన తర్వాత బెడ్‌పైకి చేరగానే.. ఎలా పడుకున్నాము అనేది కూడా పట్టించుకోకుండా నిద్రపోతుంటాము! కానీ, ఈ అలవాటును తక్షణమే మార్చుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా లేని భంగిమలో నిద్రపోవడం వల్ల శరీరంలో తీవ్రమైన అసౌకర్యం మొదలవుతుంది. ఉదయాన్నే లేవగానే చెయ్యి మొద్దుబారడం, వేళ్లలో తిమ్మిర్లు రావడం లేదా మెడ పడటం వంటి సమస్యలు మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? దీనికి మీ నిద్ర భంగిమే ప్రధాన కారణం కావచ్చు.

ఇలాంటి తప్పుడు భంగిమల వల్ల దీర్ఘకాలికంగా నరాల దెబ్బతినే ప్రమాదం ఉందా? అసలు ఏ భంగిమలో పడుకోకూడదు? వంటి విషయాలను ప్రముఖ ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్ న్యూరాలజీ కన్సల్టెంట్, స్ట్రోక్ ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ సురభి చతుర్వేది వివరించారు.

కేవలం నిద్రించే భంగిమ ఒక్కటే నరాల శాశ్వత నష్టానికి కారణ...