భారతదేశం, ఏప్రిల్ 25 -- Sita Navami 2026: శ్రీరామ నవమి వేడుకలు ముగిసిన సరిగ్గా నెలకు వచ్చే మరో అద్భుతమైన పర్వదినం 'సీతా నవమి'. దీనినే 'జానకి నవమి' అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున మిథిలా పురిలో సీతమ్మ వారు భూమి నుంచి ఉద్భవించారు. 2026 సంవత్సరంలో ఏప్రిల్ 25వ తేదీన ఈ పండుగను దేశవ్యాప్తంగా భక్తులు జరుపుకోనున్నారు. త్రేతాయుగంలో ఇదే రోజున జనక మహారాజు యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా, నాగలి చాలులో సీతమ్మ వారు లభించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆమెను 'భూమిజ' అని కూడా పిలుస్తారు.

సాధారణంగా ఏదైనా శుభకార్యం చేయాలంటే మంచి ముహూర్తం కోసం పంచాంగం చూడాల్సి ఉంటుంది. కానీ, ఈ ఏడాది సీతా నవమి నాడు 'అబూజ ముహూర్తం' (స్వయం సిద్ధ ముహూర్తం) ఏర్పడుతోంది. అంటే ఈ రోజంతా అత్యంత పవిత్రమైనదని, ఎలాంటి ప్రత్యేక ముహూర్తం చూడకుండానే శుభ కార్య...