భారతదేశం, ఏప్రిల్ 12 -- Singer Mangli: ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ (సత్యవతి రాథోడ్) చుట్టూ ఇప్పుడు పెను వివాదం ముసురుకుంది. మైక్రోఫైనాన్స్ పేరుతో కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారంటూ ఆమెపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఆరోపణలపై మంగ్లీ చాలా ఘాటుగా స్పందించింది. తనపై వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలని, కావాలనే తన పేరును బదనాం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొందరిపై రూ. 10 కోట్ల (కొన్ని రిపోర్టుల ప్రకారం అంతకంటే ఎక్కువ) మైక్రోఫైనాన్స్ మోసం జరిగినట్లు కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు చేసింది తార్నాకకు చెందిన న్యాయవాది సింగపోగు సుబ్బారావు.

సుమారు 150 నుంచి 200 మంది బాధితుల నుండి మైక్రోఫైనాన్స్ స్కీమ్ పేరుతో పెట్టుబడులు సేకరించి, అధిక లాభా...