భారతదేశం, జూలై 6 -- Sing Geetham OTT: కొన్ని సినిమాలు కేవలం ఎంటర్ టైన్మెంట్ పర్పస్ కోసమే థియేటర్లకు వస్తాయి. కానీ కొన్ని మాత్రం డిఫరెంట్ ఎక్స్ పరిమెంట్ తో ఆడియన్స్ మైండ్ లో తిష్ఠ వేస్తాయి. అలాంటి సినిమానే 'సింగ్ గీతం'. 94 ఏళ్ల సింగీతం శ్రీనివాస రావు తీసిన ఈ మ్యూజికల్ వండర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

తెలుగు సినిమాలోనే కాదు ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోనే గర్వంగా చెప్పుకునే డైరెక్టర్ పేరు సింగీతం శ్రీనివాస రావు. అలాంటి లెజండరీ డైరెక్టర్ 94 ఏళ్ల వయసులో తీసిన మూవీ 'సింగ్ గీతం'. ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. జూలై 9 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ కమింగ్ సూన్ సెక్షన్ లో సింగ్ గీతం పేరు చేర్చారు.

సింగ్ గీతం మూవీ ఓటీటీలో నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం,...