భారతదేశం, జూలై 5 -- Sing Geetham OTT: భారతీయ చలనచిత్ర రంగంలో సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, మూకీ సినిమాలను పరిచయం చేసిన ఘనత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకే దక్కుతుంది. ఆయన వయసుతో నిమిత్తం లేకుండా 94 ఏళ్ల వయసులో చేసిన తాజా అద్భుత ప్రయోగమే 'సింగ్ గీతం'. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

మ్యూజికల్ ఫాంటసీ మూవీగా, ఓ విభిన్నమైన ప్రయోగంతో వచ్చిన 'సింగ్ గీతం' చిత్రం ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ డిఫరెంట్ మూవీ జూలై 9 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. అదే రోజు ఓటీటీ రిలీజ్ అవుతుందని అంటున్నారు.

సింగ్ గీతం చిత్రం థియేటర్లలో కేవలం తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే విడుదలైంది. అయితే ఓటీటీ ఆడియన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఈ పరిధ...