భారతదేశం, జూలై 20 -- Sindhu Rajamouli: భారత క్రీడారంగంలో రికార్డుల వీరురాలు పీవీ సింధు, భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశంగా మారింది. ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంపై ఉన్న హైప్‌కు ఈ ట్విట్టర్ సంభాషణ మరింత గ్లామర్ జోడించింది.

జపాన్ ఓపెన్ టోర్నమెంట్‌లో చారిత్రాత్మక విజయం సాధించి కంబ్యాక్ ఇచ్చిన పీవీ సింధును అభినందిస్తూ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. "జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన సింధుకు శుభాకాంక్షలు.. వాట్ ఏ ఛాంపియన్స్ కంబ్యాక్.. భారతదేశం నీ గురించి గర్విస్తోంది" అని రాజమౌళి పోస్ట్ చేశారు.

రాజమౌళి ట్వీట్ కు పీవీ సింధు సరదాగా ర...