భారతదేశం, సెప్టెంబర్ 23 -- Shruti Haasan: ​సోహా అలీ ఖాన్ పాడ్‌కాస్ట్ 'ఆల్ అబౌట్ హర్' (All About Her) లో పాల్గొన్న శ్రుతి హాసన్ తన పర్సనల్ లైఫ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, ఆరోగ్య సమస్యలపై ఓపెన్‌గా మాట్లాడింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

"నాకు ఒక భాగస్వామి తోడు ఉండటం ఇష్టమే. కానీ ఒక బాక్స్‌లో ఇమిడిపోవడం నా వల్ల కాదు. సాంప్రదాయమైన ఆలోచనలు ఉన్నప్పటికీ.. పెళ్లి పేరుతో లీగల్ పేపర్‌వర్క్ చేసుకోవడం, కోట్ల రూపాయలు ఖర్చు చేసి హడావుడి నాకు నచ్చదు. అంత డబ్బు ఖర్చు చేసే బదులు అనాథలకు చారిటీ చేయడం మేలు.

నా జీవితంలో ఒకసారి పెళ్లి దాకా వెళ్లాను. కానీ చివరకు వద్దనుకున్నా. అది నా సొంత నిర్ణయాన్ని మార్చలేదు. ప్రతిరోజూ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అంతే కానీ ఒక కాగితం ముక్కపై సంతకం పెట్టడం కో...