భారతదేశం, మార్చి 22 -- ఇండియాలోనే ఫస్ట్ మోటో క్రాస్ మూవీ అంటూ 'బైకర్' థియేటర్లలోకి రాబోతుంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ ఇవాళ (మార్చి 22) రిలీజైంది. మోటర్ బైక్ రేసింగ్ నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఆదివారం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా హీరో శర్వానంద్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

బైకర్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో శర్వానంద్ స్పీచ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ ట్రెండ్ అవుతోంది. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ''ప్రభాస్ అన్న చెప్పినట్లు సీనియర్ల తర్వాతే మేం. ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు రాజశేఖర్ కు థ్యాంక్స్'' అని శర్వానంద్ అన్నాడు.

''రాజన్న (దిల్ రాజు)కు థ్యాంక్స్. వంశీ భాయ్ కూడా అలాంటి ప్రొడ్యూసరే. అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటారు. ...