భారతదేశం, మార్చి 28 -- Sharwanand: మన సక్సెస్‌తోనే విమర్శకులకు సమాధానం చెప్పాలి అని శర్వానంద్ తన సక్సెస్‌ఫుల్ సినిమా కెరీర్ ద్వారా నిరూపించాడు. తన 36వ సినిమా 'బైకర్' ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా మదనపల్లిలోని మిట్స్ కాలేజ్ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు శర్వానంద్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన జర్నీలో ఎదురైన కష్టాలను, అవమానాలను అతను చాలా ఓపెన్‌గా అందరితో పంచుకున్నాడు.

శర్వానంద్ తన స్పీచ్‌లో మాట్లాడుతూ.. "నేను చదువులో బిలో యావరేజ్ స్టూడెంట్‌ని. నన్ను చూసి అందరూ నువ్వొక వేస్ట్ ఫెలో, దేనికీ పనికిరావు అని తిట్టేవాళ్లు. సరిగ్గా 17 ఏళ్ల వయసులో నేను హీరో అవుతాను అని చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. నువ్వు హీరో ఏంట్రా.. ఇండస్ట్రీలో అస్సలు నిలదొక్కుకోలేవు.. నీకు అంత సీన్ లేదు అని మొహం మీదే చాలా దార...