భారతదేశం, జూన్ 27 -- చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. సమస్యల నుంచి బయటపడడానికి రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పదేపదే సమస్యలు ఎదురవుతున్నట్లయితే చాలామంది శని ప్రభావం గురించి ఆలోచిస్తారు. శని మనం చేసే పనులను బట్టి ఫలితాలు ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు పనులకు చెడు ఫలితాలు ఎదురవుతాయి. అలాగే ఏలినాటి శని ప్రభావం వల్ల కూడా చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటారు.

జ్యోతిష్యం ప్రకారం జూన్ 27 చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు శని త్రయోదశి రావడం వల్ల శని ప్రభావంలో ఉన్న ఐదు రాశుల వారికి విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు శని త్రయోదశి వేళ ఏ రాశుల వారికి శుభాలు కలుగబోతున్నాయి? ఎవరికి ఎక్కువగా ప్రయోజనాలు కలుగుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష త్రయోదశి శనివారం రోజు రావడంతో శని త్రయోదశిని జర...