భారతదేశం, జనవరి 8 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను అందిస్తాడు.

2026లో శని ఆరు నెలల పాటు తిరోగమనంలోనే ఉంటాడు. కొత్త సంవత్సరం 2026లో జూలై 27 నుంచి శని తిరోగమనంలో ఉంటాడు. సుమారు 6 నెలల పాటు శని తిరోగమనంలో ఉండడం జరుగుతుంది. దీంతో కొన్ని రాశుల వారు ప్రయోజనాలను పొందుతారు, విజయాలను అందుకుంటారు.

శని నెమ్మదిగా కదిలే గ్రహం. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు. శని జూలై 26న మీన రాశిలో తిరోగమనం చెందుతాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి శని తిరోగమనం కారణంగా శుభ...