భారతదేశం, ఆగస్టు 18 -- Shah Rukh Khan: నాగ పంచమి పండగ రోజే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బంగ్లా 'మన్నత్' దగ్గర ఒక మైండ్ బ్లోయింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన ఈ పండగ రోజు రాత్రి షారుఖ్ ఐకానిక్ బంగ్లాలో ఏకంగా రెండు 8 అడుగుల భారీ పాములు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం హీటెక్కింది.

ఆగస్టు 17 సోమవారం రాత్రి 8 గంటల సమయంలో షారుఖ్ ఖాన్ కు చెందిన మన్నత్ ప్రాపర్టీలోని మెట్ల కింద భాగంలో పనిచేసే సిబ్బంది ఈ పాములను చూశారు. రెండు భారీ పాములు తిరుగుతుండటంతో భయపడిపోయిన పనివాళ్లు వెంటనే వైల్డ్‌లైఫ్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. దీంతో స్పాట్‌కు చేరుకున్న రెస్క్యూ టీమ్ మన్నత్ కాంపౌండ్‌లో సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది.

గంటల తరబడి శ్రమించిన రెస్క్యూ టీమ్ ఎనిమిది అడుగుల పొడవున్న ఒక భారీ పామును సురక్షితంగా పట్టుకుంది. అయితే చీక...