భారతదేశం, అక్టోబర్ 20 -- Sequels 2026: దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'సీక్వెల్ సంస్కృతి' ఎంతటి ఘనవిజయం సాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'బాహుబలి', 'కేజీఎఫ్', 'పుష్ప' వంటి బిగ్ ఫ్రాంచైజీలు అందించిన స్పూర్తితో.. ప్రేక్షకులకు తెలిసిన పాత్రలు, ఉత్కంఠభరితమైన కథలతో సీక్వెల్స్ ను తెరకెక్కించడం ఇండస్ట్రీలో సేఫ్, సక్సెస్ ఫార్ములాగా మారింది. 2026 సంవత్సరంలో విడుదలైన పలు సౌత్ ఇండియన్ సీక్వెల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి.

తమిళ చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది సీక్వెల్స్ హవా స్పష్టంగా కనిపించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'జైలర్ 2' అక్టోబర్ 15, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

తొలి భాగం 2023లో రూ.348.55 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ఈ సీక్వె...