భారతదేశం, నవంబర్ 29 -- పదవీ విరమణ తర్వాత చేతికి వచ్చిన పొదుపు సొమ్ముపై క్రమం తప్పకుండా, అంచనాకు తగినట్లు రాబడి పొందాలనుకునే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్​డ్ డిపాజిట్​ (ఎఫ్​డీ) అనేది మొదటి, అత్యంత సురక్షితమైన ఆప్షన్​గా కనిపిస్తుంటుంది. అలాంటి ఎఫ్​డీల్లో వడ్డీ రేటు అనేది చాలా కీలకం. అయితే బ్యాంకులను బట్టి ఈ వడ్డీ రేట్లలో పెద్ద తేడా కనిపిస్తోంది. పెద్ద ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సాధారణంగా ఎక్కువ వడ్డీ అందిస్తున్నాయి. 2026 నవంబర్ 25 నాటి పైసాబజార్ డేటా ప్రకారం.. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు ఐదేళ్ల ఎఫ్‌డీపై అత్యధికంగా 8.5 శాతం వడ్డీ ఇస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో డీసీబీ బ్యాంక్, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చెరో 8 శాతం వడ్డీతో నిలిచాయి.

ఐదేళ్ల ఎఫ్‌డీ వడ్డీ రేట్ల పట్టికలో పైస్థానాలను ...