భారతదేశం, జూలై 13 -- Sekhar Master Vs Janny Master: టాలీవుడ్ లో ఇప్పుడు తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ గొడవ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్లు అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య వాగ్వాదం కూడా కలకలం రేపింది. ఈ వివాదంపై శేఖర్ మాస్టర్ రియాక్టయిన వీడియో తాజాగా వైరల్ గా మారింది. ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

డ్యాన్సర్స్ అసోసియేషన్ లో విభేధాలు, జానీ మాస్టర్ తో వివాదం గురించి శేఖర్ మాస్టర్ రియాక్టయ్యాడు. ''మా 24 క్రాఫ్ట్స్ కు ముఖ్యమైంది ఫెడరేషనే. ఎన్నికలు జరిగినా, ఏది జరిగినా వాళ్లు వస్తారు. ఇప్పుడు డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కు పడట్లేదు. ఫెడరేషన్ వాళ్లు వచ్చారు'' అని శేఖర్ మాస్టర్ చెప్పాడు.

''ఇప్పుడు ఓటింగ్ పెట్టాలన్నారు. ఫెడరేషన్ వాళ్లకు వీళ్ల తీరు నచ్చట్లేదు...