భారతదేశం, నవంబర్ 12 -- Sekhar Master: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన స్టెప్పులతో స్టార్ హీరోలకు ఎన్నో చార్ట్‌బస్టర్ సాంగ్స్ అందించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారు ప్రమాదానికి గురయ్యారనే వార్త టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ కాకా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఓ భారీ పాట చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు.

షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత శేఖర్ మాస్టర్ తన బృందంతో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో హైదరాబాద్ శివారులోని శంషాబాద్ సమీపంలోకి రాగానే ఆయన ప్రయాణిస్తున్న కారు అనుకోకుండా ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో కారులో ఉన్న వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ ప్రమాద వార్త బయటకు రావడంతో శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు కంగారుపడ్డారు. అయ...