భారతదేశం, మార్చి 13 -- టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ కాలు కదిపారు. నటి కృతిక కామ్రా, టెలివిజన్ ప్రెజెంటర్ గౌరవ్ కపూర్ పెళ్లిలో సెహ్వాగ్, యువీ డ్యాన్స్ చేశారు. వీళ్లు స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మార్చి 11న ముంబైలోని తమ నివాసంలో కృతిక కామ్రా, గౌరవ్ కపూర్ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వివాహం జరిగిన తర్వాత జంటకు వెల్ కమ్ చెప్తూ వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ తదితరులు డ్యాన్స్ చేశారు.

కృతిక కామ్రా, గౌరవ్ కపూర్ పెళ్లిలో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో క్లిప్ లో నటులు ఫర్హాన్ అక్తర్, అంగద్ బేడీ తదితరులతో కలిసి యువీ, సెహ్వాగ్ డ్యాన్స్ చేయడం కనిపించింది. 2007 నాటి క్రిస్ ...