భారతదేశం, సెప్టెంబర్ 3 -- Sehwag Review: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఒక డివోషనల్ మూవీ చూసి పూర్తిగా భావోద్వేగానికి గురయ్యారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా (Neem Karoli Baba) జీవిత ఆధారంగా తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) సినిమాను చూసిన సెహ్వాగ్.. ఆ అనుభవాన్ని వివరిస్తూ ఒక లైవ్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో షేర్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. "కొన్ని అనుభవాలు, కొందరు వ్యక్తుల గురించి చెప్పడానికి మన దగ్గర పదాలు చాలవు. ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నా అత్యంత ఆత్మీయ మిత్రులలో కొందరు నీమ్ కరోలి బాబా భక్తులు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు నాకు మహారాజ్ జీ గురించి చెప్పాడు. నాటి నుంచి ఆయన వ్యక్తిత్వం, భక్తి, ఆశీస్సుల గురించి వింటూనే ఉన్నాను" అని చెప్పారు.

మహారాజ్ జీ అనుగ...